తెలంగాణ

భాషపై పట్టుకు అభ్యసన పద్ధతులే మూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: భాషపై పట్టు సాధించాలంటే బోధన పద్ధతులు, అభ్యసన పద్ధతులపై పట్టు ఉండాలని, అదే మూలమని ఇంగ్లీషు, విదేశీ భాషల యూనివర్శిటీ (ఇఫ్లూ) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఇ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. జపాన్ భాషలో విద్యా బోధన పద్ధతులు అంశంపై గురువారం నాడు నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. జపాన్ భాషను నేర్చుకోవడం ఎంతో కష్టమని, అయినా దానిని ఇష్టంతో నేర్చుకుంటే దాని ఫలితం మనం ఊహించలేనంతగా ఉంటుందని పేర్కొన్నారు. ఏ భాషపై అయినా పట్టు సాధించాలని సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నూతన బోధన పద్ధతులు కనుగొనాల్సిన అవసరం ఉందని అన్నారు. జపాన్ భాష నేర్చుకుని అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేయాల్సిన పనే్లదని, జపనీయులే తమ పరిశ్రమలను భారత్‌లో పెడుతున్నారని, ఇక్కడే ఉద్యోగాలు చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. జపాన్ భాషను నేర్చుకున్న వారు ఇతరులకు మరింత సులభంగా ఎలా నేర్చించాలో ఆలోచించాలని అన్నారు. ఇందుకోసం నూతన ఆలోచనలు చేయాలని చెప్పారు. లుక్ ఈస్టు పేరుతో జపాన్, భారత్‌లు కలిసి పనిచేస్తున్నాయని, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు..
చైర్మన్‌గా హరిప్రసాద్
డిపార్టుమెంట్ ఆఫ్ కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎం హరిప్రసాద్‌ను గ్రాంట్స్ కమిటీ చైర్మన్‌గా, డిపార్టుమెంట్ ఆఫ్ కమ్యూనిషన్స్‌లో పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాసరెడ్డిని ఇన్నోవేషన్ క్లబ్ కో ఆర్డినేటర్‌గా విసి సురేష్‌కుమార్ నియమించారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష గురువారం నాడు ప్రశాంతంగా జరిగిందని బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. గురువారం నాడు ఫస్టియర్ మాథ్స్ -1బి, జువాలజీ, హిస్టరీ పేపర్-1 జరిగాయి. 3,78,734 మంది రిజిస్టర్ చేసుకోగా, 3,64,428 మంది హాజరయ్యారు. 14,306 మంది గైర్హాజరయ్యారు. గురువారం నాడు పలు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆదిలాబాద్‌లో , మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఒకొక్కర్నీ, వరంగల్‌లో ఇద్దరు, భూపాలపల్లిలో నలుగురు, ఖమ్మంలో ఇద్దరు, నిజామాబాద్‌లో ముగ్గురు, నల్గొండలో నలుగురు, మహబూబ్‌నగర్‌లో ఏడుగురు అభ్యర్ధులపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.
నీట్ దరఖాస్తు గడువు పొడిగింపు
నీట్ దరఖాస్తు గడువును సిబిఎస్‌ఇ ఈ నెల 12వ తేదీ వరకూ పొడిగించింది. ఆధార్‌ను తప్పని సరి చేయడం సరికాదని, దానికి ప్రత్యామ్నాయంగా బ్యాంకు అకౌంట్ నెంబర్, ఎన్నికల కార్డు లేదా ఇతర ఆధారాలను సేకరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో సిబిఎస్‌ఇ దానికి అనుగుణంగా దరఖాస్తు గడువు పొడిగించింది. ఈ నెల 12 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపునకు 13వ తేదీ రాత్రి 11.50 గంటల వరకూ గడువు విధించారు.
పాఠశాల విద్య సంచాలకుడి కార్యాలయంలో కెరీర్ గైడెన్స్ కౌనె్సలింగ్ సెల్‌ను ఏర్పాటు చేశారు. 18004257462 నెంబర్‌కు ఫోన్ చేసి తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని సంచాలకుడు జి కిషన్ తెలిపారు. ఉదయం 10.30 నుండి సాయంత్రం ఐదు లోపల ఫోన్ చేయవచ్చని, ఈ నెంబర్ ఈ నెల 12 నుండి అమలులోకి వస్తుందని చెప్పారు.