తెలంగాణ

కేసీఆర్ పాలనలో రాజ్యహింస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 10: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాజ్యహింస కొనసాగుతోందని గతంలో ఎన్నో సందర్భాలలో రాజ్యహింసకు గురయ్యారని ప్రసంగాల్లో విన్నామని అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక్షంగా రాజ్యహింసను కళ్లారా చూస్తున్నామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీసెల్ కార్యకర్తల సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, ఓబీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు చిత్తరంజన్‌దాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని అందుకు కేసీఆరే కారణమని ఆయన పాలనలో అన్నివర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకకుండా దుర్మార్గపు పాలనను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునాదులు గట్టిగానే ఉన్నాయని తెలుసుకున్న కేసీఆర్‌కు భయం పట్టుకుందని అన్నారు. అందుకే ప్రజలు చైతన్యవంతులు అయితే టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయరని గ్రహించిన ఆయన కులవృత్తుల వారు అభివృద్ధి చెందకుండా వారి తల్లిదండ్రులు, వారి పిల్లలు ఒకేలా బతకాలని గొర్రెలు, బర్రెలు, చేప పిల్లలంటూ బడుగు, బలహీనవర్గాల వారి జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలో ఏ పోరాటం జరిగినా అది ఆత్మగౌరం అనే విధంగా జరిగాయని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉద్యమాలను అణచివేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ప్రశ్నిస్తే హింసిస్తామనే విధానం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఇది పూర్తిగా రాజ్యహింసను తలపిస్తుందని అందుకే తాను తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యహింసను కొనసాగిస్తున్నారని కచ్చితంగా చెబుతున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక టీఆర్‌ఎస్ పార్టీపై తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇక ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్ లేదని ఇప్పటికే టీఆర్‌ఎస్‌ను ఎందుకు అధికారంలోకి తీసుకువచ్చామనే బాధను ప్రజలు వెలిబుచ్చుతున్నారని అన్నారు.
ఆ ఫ్రంట్, ఈ కూటమి, ఆ కూటమీలు, పార్టీల కలయికలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టంగా కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాంత్రీయ పార్టీలకు మాత్రం అధికారం తెలంగాణలో రాదని ఆయన తేల్చిచెప్పారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ ఓబీసీ సెల్‌ను బలోపేతం చేసి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. బలహీన వర్గాలకు చెందిన నాయకులు బలపడితే అలాంటి వారికి పార్టీలో తప్పకుండా గుర్తింపు లభిస్తుందని రాబోయే ఎన్నికల్లో పెద్దపీట వేస్తామని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, నాయకులు రాజేందర్‌గౌడ్, ప్రధీప్‌కుమార్‌గౌడ్, శ్రీహరి, మణెమ్మ, ఉబెదుల్లా కొత్వాల్, ముత్యాల ప్రకాష్, సంజీవ్‌ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ఓబీసీ సెల్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క