తెలంగాణ

మళ్లీ తెరపైకి సోలార్ ఎక్స్‌ప్లోజర్స్ పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, మార్చి 10: పెద్దపల్లి జిల్లాలోని రాగినేడు గ్రామంలో సోలార్ సంస్థ ఎక్స్‌ప్లోజర్స్ (పేలుడు పదార్థాల తయారీ) పరిశ్రమ ఏర్పాటు మళ్లీ తెరపైకి వచ్చింది. రాగినేడు గ్రామ సమీపంలో సోలార్ సంస్థ కొనుగోలు చేసిన వ్యవసాయ భూములను వ్యవసాయ శాఖ పెద్దపల్లి డివిజన్ ఎడిఎ జాకీర్ అలీ, ఎవో ప్రకాశ్‌తో కలసి శనివారం పరిశీలించారు. వ్యవసాయ భూములను కమర్షియల్‌గా మార్చడానికి సోలార్ సంస్థ నాలా పన్ను చెల్లించిన నేపథ్యంలో ఆ భూములను పరిశీలించినట్టు ఏడిఏతెలిపారు. దీనితో సోలార్ ఎక్స్‌ప్లోజర్స్ పరిశ్రమ ఏర్పాటు అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. నాగపూర్‌కు చెందిన సోలార్ సంస్థ రాగినేడు గ్రామసమీపంలో ఎక్స్‌ప్లోజర్స్ పరిశ్రమ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రెండు సంవత్సరాల కిందట రైతుల నుంచి సుమారు 30 ఎకరాల వ్యవసాయ భూములు కొనుగోలు చేసింది.
సోలార్ కంపెనీ అంటే సూర్యరశ్మి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమ అని మొదట ఇక్కడి ప్రజలు భావించారు. ఈ ప్రాంతంలో కంపెనీ ఏర్పాటు చేస్తే ఇక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, గ్రామం అభివృద్ధి చెందుతుందని మొదట గ్రామస్తులు భావించారు. తీరా కంపెనీ ఏర్పాటు కోసం గ్రామ పంచాయతీ తీర్మానం కోసం ప్రతినిధులు సంప్రదించిన సందర్భంలో ఇక్కడ ఏర్పాటు చేసేది పేలుడు పదార్థాల పరిశ్రమ అని తేలడంతో గ్రామస్తులు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. దీనివల్ల ఏర్పడే కాలుష్యం వల్ల గ్రామంలో మానవ మనగడకు ముప్పు వాటిల్లడంతో పాటు పంట చేలకు నష్టం జరుగుతుందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. గత యేడాది కిందట పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి కోసం గ్రామ పంచాయతీ తీర్మానం చేయకుండా ప్రజలంతా అడ్డుకున్నారు.
దీంతో కొంత కాలం పరిశ్రమ ఏర్పాటుకు బ్రేకు పడింది. అయితే అన్ని రకాల అనువైన ప్రదేశమని భావిస్తున్న సోలార్ సంస్థ కంపెనీ ఏర్పాటు చేయడానికి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్థాయిలో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
పరిశ్రమల ఏర్పాటుకు ద్వారాలు తెరచి ఉన్న ప్రభుత్వం ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వ ఆదాయం దృష్ట్యా పరిశ్రమకు అనుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఏర్పాటు కోసం అడ్డంకులు తొలగించుకోవడానికి సోలార్ సంస్థ అన్ని శాఖల ద్వారా అవసరమైన క్లియరెన్స్ తీసుకునే పనిలో సోలార్ సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది. దీనితో రాగినేడు గ్రామంలో మళ్లీ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు.