తెలంగాణ

నలుగురు చిన్నారుల సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్ ఘన్‌పూర్, మే 12: ఇద్దరు చిన్నారులను సజీవ దహనం చేసిన తండ్రి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని పాంనూర్ గ్రామంలో గురువారం జరిగింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం ఈవిధంగా ఉన్నాయి. గ్రామానికి చెందిన బత్తిని శ్రీనివాస్, మీదికొండకు చెందిన రేణుకతో 2007లో వివాహం జరిగింది. అప్పటి నుండి వారి జీవితం సాఫీగానే సాగినప్పటికీ గత కొన్ని రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. చిలికిచిలికి గాలివానగా మారిన గొడువలతో క్షణికావేశానికి గురైన శ్రీనివాస్ ఇంట్లోనే ఉన్న భార్య రేణుకను బయటికి గెంటేసి తలుపులను బిగించి తన ఇద్దరు చిన్నారులు రసజ్ఞ (7), అక్షిత (5)పై కిరోసిన్ పోసి నిప్పంటించగా సజీవ దహనానికి వడిగట్టాడు. మంటల తాకిడి తట్టుకోలేక చిన్నారులిద్దరూ సజీవ దహనం కావడంతో మాంసపు ముద్దల్లా మారిపోయారు. అంతటితో ఆగని శ్రీనివాస్ తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నారుల మృతదేహాల వద్ద తల్లి రేణుక రోదనలు మిన్నంటగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా కేసు నమోదు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సంఘటనతో మండలంలోని ఫాంనూర్‌లో విషాదం నింపింది.
పెండ్లిపాకల గ్రామంలో..
దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పెండ్లిపాకల గ్రామంలో గురువారం పెను విషాద సంఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై ఏడ్పుల అశ్విని (5), వీరగండ్ల కార్తికేయ (2) అనే ఇద్దరు చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెండ్లిపాకల గ్రామానికి చెందిన ఏడ్పుల సంతోషి, తిరుపతయ్య దంపతులకు ఇద్దరు సంతానం. వీరి ఇంటికి నాంపల్లి మండలం సుంకిశాల గ్రామానికి చెందిన బంధువులు వెంకటయ్య, రమణలు చుట్టపు చూపుగా వచ్చారు. గురువారం మధ్యాహ్నం కార్తికేయను తిరుపతయ్య ఇంటి ముందు ఉన్న పాకలో చీర కట్టి చేసిన ఉయ్యాలలో వేసి బాలిక అశ్విని ఊపుతూ ఉంది. ఆ సమయంలో ఇంట్లో పెద్దవారు ఎవరూ లేరు. అశ్విని ఊయలలో ఉన్న చిన్నారి కార్తికేయను బలంగా ఊపడంతో చీర తెగి చిన్నారి పక్కనే విద్యుత్ వైరుకు అమర్చిన కర్రగుంజపై పడిపోయాడు. దీంతో కర్రకు ఉన్న విద్యుత్ వైరు తెగిపోవడం, గుంజ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఇద్దరు చిన్నారులు పాక కింద చిక్కుకుపోయారు. విద్యుత్ వైరు తెగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఇద్దరు చిన్నారులు సజీవదహనమయ్యారు. చుట్టుపక్కలవారు వచ్చి పాకను తొలగించి చిన్నారులను కాపాడే యత్నం చేయగా అప్పటికే చిన్నారులిద్దరూ మాడిమసైపోయారు. సమాచారం అందిన వెంటనే దేవరకొండ తహశీల్దార్ గణేశ్, సిఐ గట్టుమల్లు ఘటనాస్ధలికి చేరుకొని పరిస్ధితిని సమీక్షించారు.