తెలంగాణ

రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తానని తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా సోమవారం ఆయన వ్యవసాయ శాఖ కమినర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు, కార్యక్రమలు చేపట్టారని, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్‌గా తనకు కేసీఆర్ బాధ్యతలు అప్పగించడం తన అదృష్టమన్నారు. సంక్షోభం నుండి సంక్షేమం వైపు వ్యవసాయ రంగాన్ని నడిపిస్తానన్నారు.
పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) లభించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమన్వయ సమితి సభ్యులు 1,61,000 మంది ఉన్నారని, వీరందరికీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నాయకత్వం వహిస్తారన్నారు. దేశంలో అన్ని రంగాల కార్మికులకు సంఘాలు ఉన్నాయని, రైతులకు మాత్రమే సంఘాలు లేవని, ఈలోటు భర్తీ చేసేందుకు రైతు సమన్వయ సమితులు పనిచేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మలనాగేశ్వరరావు, నాయిని నర్సింహారెడ్డి, హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఏ. ఇంద్రకరణ్‌రెడ్డి, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, వ్యవసాయ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి, కమిషనర్ డాక్టర్ ఎం. జగన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.