తెలంగాణ

27 వరకు బడ్జెట్ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 27 వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఏసి) నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగం మినహాయించి మొత్తం 11 వర్కింగ్ దినాలు సభ నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. ఈ నెల 15న శాసనసభ, శాసనమండలి ఉభయ సభల్లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి పద్దులపై చర్చ ముగిసిన అనంతరం 27న ద్రవ్య వినిమియ బిల్లును ఆమోదించాలని బిఏసి నిర్ణయించింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగం ముగిసిన అనంతరం స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అధ్యక్షతన బిఏసి సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనసభ వ్యవహారాల మంత్రి టి హరీశ్‌రావు, ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి, ఉప నాయకుడు భట్టి విక్రమార్కతో పాటు ఎంఐఎం నుంచి అక్బరుద్ధీన్ ఒవైసీ, బిజెపి నుంచి జి కిషన్‌రెడ్డి, టిటిడిపి నుంచి సండ్ర వెంకటవీరయ్య, సిపిఎం నుంచి సున్నం రాజయ్య తదితర అధికార, ప్రతిపక్షాలకు చెందిన నాయకులు బిఏసికి హాజరయ్యారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి హరీశ్‌రావు మాట్లాడుతూ, గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఈ నెల 28న విదేశీ పర్యటనకు వెళ్లనుండటంతో 27నే ద్రవ్య వినిమియ బిల్లును ఆమోదించుకోవాల్సి ఉందన్నారు. గవర్నర్ విదేశాలకు వెళ్లేలోపు ద్రవ్య వినిమియ బిల్లు ఆమోదించుకోకపోతే ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ కారణాల దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో 27ననే బిల్లు ఆమోదించుకోవాల్సిందేనని మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించగా బిఏసి ఆమోదించింది. అలాగే బడ్జెట్ సమావేశాలకు తేదీలను ఖరారు బిఏసి ఖరారు చేసింది. దీని ప్రకారం మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభలో ప్రభుత్వం ప్రవేశ పెట్టాక, దీనిపై బుధవారం వరకు (13,14 తేదీల్లో) చర్చించాలని బిఏసి నిర్ణయించింది. ఆ మరుసటి రోజు (15వ తేదీ) సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. బడ్జెట్ పద్దులపై అధ్యయనానికి 16న సెలవు, 17న (శనివారం సెలవు), 18న (ఆదివారం-ఉగాది పండుగ) పురస్కరించుకొని సభకు సెలవులు ఖరారు చేసింది. సభ తిరిగి 19వ తేదీన ప్రారంభం కాగానే బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇస్తారు. ఆ తర్వాత వరుసగా 20, 21, 22, 23, 24, 25 (ఆదివారం కూడా) వరుసగా సమావేశాలు కొనసాగుతాయి. 26న శ్రీరామ నవమి సందర్భంగా సభకు సెలవు. ఆ తర్వాత మరుసటి రోజు 27న ద్రవ్య వినిమియ బిల్లుతో పాటు ఇతర బిల్లులు ఆమోదం పొందాక సభ నిరవధికంగా వాయిదా పడనుంది.

చిత్రం..స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన బీఏసి సమావేశం