తెలంగాణ

స్వామిగౌడ్‌కు చికిత్స.. మంత్రుల పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12:. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన అలజడిలో కంటికి గాయం అయిన మండలి చైర్మన్ స్వామి గౌడ్‌కు సరోజని దేవి ఆసుపత్రిలో చికిత్సలు అందించారు. సోమవారం ఉదయం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం చేస్తుండగా అడ్డుతగిలిన కాంగ్రెస్ సభ్యులు పోడియంలోకి దూసుకువచ్చేందుకు ప్రయత్నించారు. కాగా వారిని మార్షల్స్ అడ్డుకోవడంతో మైక్‌లను గవర్నర్ వైపుకు విసరగా అది స్వామిగౌడ్ కంటికి తగిలింది. దీంతో ఆయనను అధికారులు మొదట అసెంబ్లీ ప్రాంగణంలోని ఫిజిషియన్‌కు చూపించగా అక్కడి వైద్యుల సూచన మేరకు మెహిదీపట్నంలోని సరోజని దేవి కంటి వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్ పరీక్షించి స్వామిగౌడ్‌కు చికిత్సలు అందించారు.
ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న గౌడ్‌ను ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, మహేందర్‌రెడ్డి, ఎంపీ కే.కేశవరావుతో పాటు పలువురు నాయకులు పరామర్శించారు. అనంతరం పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కంటికి దెబ్బతగిలినందున వాపుతో ఎర్రగా మారిందని, నలుగురు సభ్యులు కలిగిన బృందం ఆయనకు చికిత్సలు అందిస్తున్నట్టు వివరించారు. కాగా స్వామిగౌడ్‌ను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన కాంగ్రెస్ నేతలను టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న స్వామిగౌడ్ లోనికి అనుమతించాల్సిందిగా ఆదేశించడంతో శాంతించిన వారు అడ్డుతప్పుకున్నారు. అనంతరం లోనికి వెళ్లిన షబ్బీర్ అలి తదితరులు ఆయన్ను పరామర్శించారు.

చిత్రాలు..కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాడిలో గాయపడిన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను ఆస్పత్రిలో పరామర్శిస్తున్న మంత్రి కడియం శ్రీహరి తదితరులు