తెలంగాణ

హైదరాబాద్ శివార్లలో రెండు లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు చకాచకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: హైదరాబాద్ శివార్లలో రెండు లాజిస్టిక్ పార్కుల నిర్మాణం వేగవంతమైంది. దీని వల్ల ఒక కోటి జనాభాతో కిటకిటలాడుతున్న హైదరాబాద్‌లో బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల రాకపోకలను నియంత్రించవచ్చును. రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో లాజిస్టిక్‌పార్కులు బాట సింగారం, మంగళపల్లి వద్ద ఏర్పాటవుతున్నాయి. గత అక్టోబర్ నెలలో లాజిస్టిక్‌పార్కుల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. జాతీయ రహదారి 65 వద్ద బాటసింగారంకు సమీపంలో 40 ఎకరాల స్థలంలో , నాగార్జునసాగర్ రోడ్డు వద్ద 22 ఎకరాల్లో మంగళపల్లి వద్ద లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే రెండు స్ధలాల్లో పనులు వేగవంతమయ్యాయి. వీటికి సంబంధించి డిజైన్లకు అనుమతి పనులను ప్రణాళిక శాఖ చురుకుగా పరిశీలిస్తోంది. బాటా సింగారం వద్ద 40 ఎకరాల్లో 12 ఎకరాల్లో కొండలు విస్తరించి ఉన్నాయి. లాజిస్టిక్ పార్కులు ఏర్పాటైతే వేలాది మంది ఉపాధి కలుగుతుందని అంచనా. మంగళపల్లి వద్ద కూడా వీలైనంత వేగంగా పనులు పూర్తి చేసి లాజిస్టిక్ పార్కును సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. లాజిస్టిక్‌పార్కుల్లో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజి పాయింట్లు ఏర్పాటు చేస్తారు. బాటసింగారం వద్ద 500 ట్రక్కులు నిలిపేందుకు ప్రణాళిక ఖరారు చేశారు. ఇక్కడ 10 వేల చదరపపు అడుగుల్లో ఆటోమొబైల్ సర్వీసు సెంటర్లను ఏర్పాటు చేస్తారు. పదివేల టన్నుల సరుకు నిల్వ చేసే విధంగా కోల్డ్ స్టోరేజిలను నిర్మిస్తారు. అలాగే 2లక్షల చదరపు అడుగుల్లో గిడ్డంగులను నిర్మించాలని ప్రతిపాదించారు. మంగళపల్లి వద్ద 250 ట్రక్కులకు పార్కింగ్ కల్పిస్తారు. ఇక్కడ ఐదు వేల చదరపు అడుగుల్లో ఆటోమొబైల్ సర్వీసు స్టేషన్లను నిర్మిస్తారు. పదివేల చదరపు అడుగుల్లో గిడ్డంగులను, ఐదు వేల టన్నుల సరుకు పట్టేవిధంగా కోల్ట్‌స్టోరేజిని నిర్మిస్తారు.