తెలంగాణ

థేశానికే ఆదర్శంగా కేసీఆర్ పరిపాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణలో కే. చంద్రశేఖరరావు పరిపాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని శాసనసభలో చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వ ర్ పేర్కొన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ సోమవారం చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని మంగళవారం ఆయన సభలో ప్రతిపాదించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఈ తీర్మానాన్ని బలపరిచారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరిపాలన సాగించేవారు రాజనీతిజ్ఞులుగా గుర్తింపు తెచ్చుకుంటారని, కేసీఆర్ కూడా ప్రముఖ రాజనీతిజ్ఞుడని పేరుతెచ్చుకున్నారన్నారు. కేసీఆర్ పరిపాలనలో సాగునీరు, తాగునీటి పథకాలతో పాటు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు. ఉపాధి కల్పనకు, గ్రామాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్న కులవృత్తులను కాపాడేందు కు, ఈ వృత్తుల వారికి భారీగా ఆర్థిక సాయం చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు కాక ముందు ఈ ప్రాంతంలో తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయం కంటే తక్కువగా ఉండేదని, ఇప్పుడు తెలంగాణలో తలసరి ఆదాయం (1,54,000 రూపాయలు) కాగా జాతీయ స్థాయి లో ఇది 1,03,000 రూపాయలుగా మాత్రమే ఉందన్నారు. ఆడవుల పెంప కం వల్ల ప్రకృతి మధ్య సమతుల్యత సాధించేందుకు వీలవుతుందని, అం దువల్లనే హరితహారం పేరుతో పెద్దఎత్తున మొక్కల పెంపకం చేపట్టామన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా చాలా ముందు వరుసలో ఉందని టీఆర్‌ఎస్ సభ్యుడు కేపీ వివేకానంద పేర్కొన్నారు. గత ఏడాది దక్షిణ భారత రాష్ట్రాల సమావేశం జరగగా, కేంద్రప్రభుత్వ అధికారులు తెలంగాణ అభివృద్ధిని వేనోళ్ల పొగిడారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి పారుదల ప్రాజెక్టులు తదితర పథకాలన్నీ ‘సస్టెయినబుల్ డెవలప్‌మెంట్’కు ఉదాహరణగా నిలుస్తున్నాయంటూ కేంద్ర అధికారులు పేర్కొన్నారన్నారు.
తెలంగాణ ఏర్పాటు కాకముందు సంక్షోభ పరిస్థితిలో ఉన్న తెలంగాణ ఇప్పుడు సంక్షేమం దిశలో ముందుకు దూసుకుపోతోందన్నారు. భూరికార్డుల ప్రక్షాణల దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించారు.