తెలంగాణ

అందరికీ ఉచితంగా ఆరోగ్య పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ డయాగ్నస్టిక్స్ కింద హబ్ , స్పోక్ విధానంలో పౌరులందరికీ ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్టు వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి తెలిపారు. శాసనసభలో ఆశన్నగారి జీవన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెబుతూ ఇంత వరకూ కేంద్రం స్థానంగా హైదరాబాద్‌లో ఒక సెంట్రల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని అన్నా రు. యుపిహెచ్‌సి స్థాయిలో నమూనాలు సేకరించి, సెంట్రల్ ల్యాబ్ జాబితాలో చేర్చడమైందని అన్నారు. ఇంత వరకూ 19,044 మంది రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని అన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సిన 20 సెంట్రల్ ల్యాబ్‌లు మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్, శ్రీనివాసగౌడ్, అజయ్‌కుమార్, మదన్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ ముందస్తు పరీక్షలు నిర్వహించి ఇంటింటి ఆరోగ్య ప్రొఫైల్స్‌ను రూపొందించాలని అన్నారు. అజయ్‌కుమార్ మాట్లాడుతూ కనీసం నాలుగైదు లక్షలు వెచ్చించి పిహెచ్‌సి, ఏరియా ఆస్పత్రుల్లో ల్యాబ్‌లను పటిష్టం చేయవచ్చని అన్నారు. మంత్రి వారి ప్రశ్నలకు బదులిస్తూ సిఎం సూచన మేరకు బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఇమ్యునేజేషన్, ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్, ట్రీట్‌మెంట్ అనే నాలుగదశల్లో తెలంగాణలో అంతా ఆరోగ్యంగా ఉండేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.
60 శాతం బాలలకు ఇప్పటికే టీకాలు వేస్తున్నామని, రానున్న రోజుల్లో 90 శాతం మందికి త్వరలో వంద శాతం పిల్లలకు టీకాలు వేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లోనే మరో 8 మినీ హబ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఆరోగ్య పరీక్షల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతామని వెల్లడించారు.