తెలంగాణ

ఐఏఎస్‌లు@ 208

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: తెలంగాణకు సంబంధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారుల తుది జాబితాను ఖరారు చేస్తూ శుక్రవారం డివోపిటి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణకు తొలుత 167మంది ఐఏఎస్ అధికారులను కేటాయించారు. అయితే కొత్త రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నందున ఏఎఎస్‌ల కేటాయింపు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం కేంద్రాన్ని కోరింది. కొత్త జిల్లాల ఏర్పాటు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని 45మంది ఐఏఎస్‌లను పెంచారు. దీంతో తెలంగాణలో ఐఏఎస్‌ల సంఖ్య 208కి చేరుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారుల విభజన పూర్తయింది. శాఖల వారీగా హోదాపైనా స్పష్టత ఇస్తూ డివోపిటి ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఒక సిఎస్‌తో పాటు ఇద్దరు స్పెషల్ సిఎస్‌లు ఉంటారు. 16మంది ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారులు, 18 మంది కార్యదర్శి స్థాయి అధికారులు, 19మంది కమిషనర్ స్థాయి అధికారులు ఉంటారు. ప్రస్తుతానికి పది జిల్లాలకు పది మంది కలెక్టర్లు, 11 మంది జాయింట్ కలెక్టర్లు, 21మంది డైరెక్టర్లు, ప్రాజెక్టు డైరెక్టర్లుగా మరో ఐదుగురు జాయింట్ కలెక్టర్లు ఉంటారు. జిహెచ్‌ఎంసికి కమిషనర్లుగా ముగ్గురు ఉంటారు. స్పెషల్ కలెక్టర్లు ( ఐ అండ్ క్యాడ్) ముగ్గురు, తెలంగాణ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌కు ఒక పోస్టు, టిఎస్‌పిఎస్సీకి ఒకటి, ఈసీ డిప్యూటీ సిఇఓగా ఒక పోస్టు, సిసిఎల్‌ఏ కార్యదర్శిగా ఒక పోస్టు, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్‌గా ఒక పోస్టు ఉంటుంది. కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్‌పై 45మంది ఐఏఎస్‌లు, స్టేట్ డిప్యూటేషన్‌పై 28 మంది ఐఏఎస్‌లు, రిజర్వ్ ఫర్ ట్రైనింగ్‌లో ముగ్గురు, రిజర్వ్ ఫర్ లీవ్‌లో 18 మంది, కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా 63మంది ఉంటారు.