తెలంగాణ

తెలంగాణలో పెరుగుతున్న నగర జనాభా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: తెలంగాణలో నగరాల్లో నివసించే జనాభా పెరుగుతోంది. నగరాల జనాభా పెరగడం ఆర్థికాభివృద్ధికి సూచికగా భావించాలని సామాజిక, ఆర్థిక అవుట్‌లుక్ 2018లో రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. దేశం మొత్తంపైన నగరాలుశరవేగంగా అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ నగర స్వరూపాలు మారిపోతున్నాయి. రాష్ట్ర జనాభా 3.5 కోట్లు. ఇందులో 1.36 కోట్ల మంది రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నగరాల జనాభా వృద్ధితో పోల్చితే తెలంగాణ వృద్ధిరేటు ఎక్కువగా నమోదైంది. దేశం మొత్తం మీద జనాభాలో 31.2 శాతం మంది నగరాల్లో నివసిస్తున్నారు. తెలంగాణలో 38.9 శాతం మంది నగరాల్లో నివసిస్తున్నారు. 11 రాష్ట్రాల నగరాల్లో జనాభా అభివృద్ధి జాతీయ సగటు కంటే ఎక్కువ. నగరాల జనాభా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఏడవ స్థానాన్ని పొందింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 29.5 శాతం మంది నగరాల్లో నివసిస్తున్నారు. ఒడిశా 16.7 శాతం, అస్సాం 14.1 శాతం, బీహార్ 11.3 శాతం, హిమాచల్ ప్రదేశ్ 10 శాతం మంది నగరాల్లో నివసిస్తున్నారు. దేశం మొత్తం మీద గోవాలో 62.2 శాతం, మిజోరాంలో 52.1, తమిళనాడులో 48.4 శాతం, కేరళలో 47.3 శాతం, మహారాష్టల్రో 45.2 శాతం, గుజరాత్‌లో 42.6 శాతం మంది, కర్నాటకలో 38.7 శాతం, పంజాబ్‌లో 37.5 శాతం మంది నగరాల్లో నివసిస్తున్నారు. నగర జనాభా పెరుగుదలకు మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి చ.కి.మీ పరిధిలో 400 జనాభా ఉండాలి. ప్రతి వంద మందిలో 75 మంది పురుషులు వ్యవసాయేతర పనులు చేస్తుండాలి. కనీస జనాభా ఐదు వేలు ఉండాలి. ఈ అంశాల ప్రాతిపదికన నగరాల్లో జనాభా పెరుగుతుందని అం చనా వేసి ప్రకటిస్తారు. రాష్ట్ర జనాభాలో 20 శాతం మంది హైదరాబాద్‌లో ఉంటున్నారు. రాష్ట్ర జనాభాలో రెండు శాతం మంది వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్నారు. ఈ రెండు నగరాల తర్వా త రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో జనాభా పెరుగుతోంది.