తెలంగాణ

రెండు నెలల పాటు నగరంలో నిషేదాజ్ఞలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: శాంతి-్భద్రత ల పరిరక్షణ దృష్ట్యా రానున్న రెండు నెలల పాటు సచివాలయానికి మూడు కిలో మీటర్ల పరిధిలో నిషేదాజ్ఞలు విధించినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ నెల 19 నుంచి మే 18వ తేదీ వరకు ఈ నిషేదాజ్ఞలు అమల్లో ఉం టాయని స్పష్టం చేశారు. ఈ పరిధిలో ఎలాంటి బహిరంగ సభలు, పికెటింగ్‌లు, ధర్నాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, ఐదుగు రు అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడి ఉండడాన్ని నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఆజ్ఞలు ఉల్లంఘించిన వారిపై హైదరాబాద్ పోలీసు చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
17న రాజ్‌భవన్ రోడ్డులో
ట్రాఫిక్ ఆంక్షలు
ఉగాది పండుగ నేపథ్యంలో ఈ నెల 17న రాజ్‌భవన్‌లో ఉత్సవాలు జరగనున్నందున ఆ దారిలో ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బంది ఉంటుందని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉగాది ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే విఐపిల వాహనాలు అధికంగా ఉం టాయని, అందుకు అనుగుణంగా పార్కిం గ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాజ్‌భవన్ రోడ్డులో ప్రయాణించే సాధారణ పౌరులు ఆ సమయంలో ప్రత్యామ్నాయ రూట్లలో తమ గమ్యస్ధానాలకు చేరుకోవాలని ట్రాఫి క్ పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. కాగా ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు రెండు రోజుల నగర పర్యటన సందర్భం గా ఈ నెల 17, 18 తేదీల్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. 17న రాజ్‌భవన్‌లో జరిగే ఉగాది వేడుకల్లో ఉప రాష్టప్రతి హాజరవుతున్నందున ట్రాఫిక్ ఆంక్షలు అమలు జరుగుతాయని పోలీసులు తెలిపారు.