తెలంగాణ

త్వరలో తూకారంగేట్ ఆర్‌యూబీ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: గత 30 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న తుకారంగేట్ ఆర్‌యూబీ పనులను త్వరలో ప్రారంభించనున్నట్టు మంత్రి పద్మరావు గౌడ్ తెలిపారు. శుక్రవారం నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల నుంచి సమస్యల అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి అభివృద్ధి పనుల వివరాలను తెలుసుకున్నారు. ఆర్‌యూబీ ఆలస్యం తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపధ్యంలో మొదటి ప్రాధాన్యత అంశంగా ఈ పను లు చేపట్టాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఇందు కోసం రైల్వే, జీహెచ్‌ఎంసీ నిధులను నుంచి నిర్మా నం చేపట్టి సాధ్యమైనంత త్వరలో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు మంత్రి సూచించారు. అదేవిధంగా 16కోట్ల వ్యయంతో ఒకే చోట ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీ, పాఠశాలల భవనాలను నిర్మించనున్నట్టు చెప్పారు.