తెలంగాణ

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పలు ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల వివరాలను తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడ విద్యార్ధులు ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మరుగుదొడ్ల సమస్య ఉందని మంత్రికి వివరించడంతో వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులకు మంత్రి సూచించారు. ఇందు కోసం అవసరం ఉన్న ప్రాంతాల్లో నూతన పైప్‌లైన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలు సమస్యలు ఉన్నాయంటూ అధికారుల దృష్టికి తీసుకురాగానే జాప్యం లేకుండా వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.