తెలంగాణ

గాంధీభవన్‌లో దొంగ దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నాయకులు దొంగ దీక్షలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని టిఆర్‌ఎస్ మండిపడింది. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచేలా చేయడంతో ఇక తమకు రాజకీయ భవిష్యత్ లేదన్న భయం కాంగ్రెస్ నాయకులను వెంటాడుతుందని టిఆర్‌ఎస్ విమర్శించింది. దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా ఏ విధంగా నిలువగలిగిందో 2018-19 వార్షిక బడ్జెట్ చాటి చెప్పిందని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో శుక్రవారం కర్నె మాట్లాడుతూ, దేశ వృద్ధి రేటు కంటే తెలంగాణ రాష్ట్ర వృద్ధిరేటు మిన్నగా నిలిచిందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎంత గొప్పగా అభివృద్ధి సాధిస్తుందో బడ్జెట్ అద్దం పట్టిందన్నారు. బంగారు తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌కున్న విజన్‌ను బడ్జెట్‌లో ప్రతిబింబించిందన్నారు. టిఆర్‌ఎస్‌లో చేరితే కాంట్రాక్టు పనులు ఇస్తామని తనను మభ్య పెట్టారని శాసనసభలో సభ్యత్వం కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించడాన్ని ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తెర వెనుక రాజకీయాలలో కాంగ్రెస్ నాయకులే సిద్ధహస్తులని కర్నె ఏద్దేవా చేసారు.