తెలంగాణ

తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ధీమాగా అన్నారు. త్రిపురలో తమ పార్టీకి సంస్థాగతంగా ఎలాంటి బలం లేకపోయినా అధికారంలోకి వచ్చిందని ఆయ న గుర్తు చేశారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం అరుణ్ సింగ్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన బిజెపి రాష్ట్ర పదాదికారులు, ఒబిసి మోర్చా, సోషల్ మీడియా సమావేశాల్లో అరుణ్ సింగ్ మాట్లాడుతూ 2014 తర్వాత దేశంలో 14 రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుందని ఆయన తెలిపారు. కర్నాటక ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత దక్షిణాది రాష్ట్రాల రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని, అవి తమ పార్టీకి అనుకూలిస్తాయని అన్నారు. ఎన్డీయే నుంచి టిడిపి వెళ్ళిపోయినంత మాత్రాన జరిగే నష్టమేమీ లేదని, ఇది తమ పార్టీ అనుకూలిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణలో పోలింగ్ కేంద్రం స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాలని ఆయన చెబుతూ పలు సూచనలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన వివరించారు. ప్రధాని మోదీ వల్ల దేశం అభివృద్ధి చెందుతున్నదని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని అరుణ్ సింగ్ తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, పార్టీ శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సాంబమూర్తి, జి. ప్రేమేందర్ రెడ్డి, జి. మనోహర్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. శనివారం ఖమ్మం, వరంగల్ రూరల్ జిల్లాల్లో జరిగే పార్టీ పోలింగ్ కేంద్రం, మండల స్థాయి, జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశాల్లో అరుణ్ సింగ్ పాల్గొంటారు.
కేంద్రం భయపడదు..
ఇలాఉండగా బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాసాలకు కేంద్రం భయపడదని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడను ఉద్ధేశించి అన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్