తెలంగాణ

సీపీఎస్ కేంద్ర పరిధిలో లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: కొత్త పెన్షన్ విధానం (సిపిఎస్) రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటనలో వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర కొత్త పెన్షన్ ఉద్యోగుల సంఘం ఖండించింది. సిపిఎస్ విధానాన్ని కొనసాగించాలన్నా, రద్దు చేయాలన్నా అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని కేంద్ర ఆర్థిక శాఖ, సమాచార హక్కు చట్టం ద్వారా వేర్వేరుగా సేకరించిన పత్రాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేసినట్టు కొత్త పెన్షన్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ ఒక ప్రకటనలో తెలిపారు. సిపిఎస్ రద్దు చేసే అంశం తమ పరిధిలో లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల శాసనసభలో ప్రకటించారని ఆయన గుర్తు చేసారు.
ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో వాస్తవం లేదని నిరూపించే పత్రాలను శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల కలక్టర్లకు తమ సంఘం తరఫున అందజేసినట్టు ఆయన తెలిపారు. ఈ అంశంపై తమ సంఘం ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖను కలక్టర్లకు అందజేసామన్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది సిపిఎస్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సిపిఎస్ రద్దుకు సిఎం చొరవ చూపెట్టాలని స్థితప్రజ్ఞ విజ్ఞప్తి చేసారు. సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగులకు ఏ విధమైన నష్టం కలుగనుందో ముఖ్యమంత్రికి వివరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని స్థితప్రజ్ఞ విజ్ఞప్తి చేసారు.