తెలంగాణ

తలసరి ఆదాయంలో రంగారెడ్డి ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: తెలంగాణలోని 31 జిల్లాల్లో తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా అత్యధిక ఆదాయంతో అగ్రగామిగా నిలిచింది. రంగారెడ్డి జిల్లా సంపన్నమైన జిల్లాగా తన పేరును నిలబెట్టుకుంది. రెండవ స్థానంలో హైదరాబాద్, మూడవ స్థానంలో మేడ్చెల్-మల్కాజగిరి నిలిచాయి. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.2,80,602గా నమోదైంది. హైదరాబాద్ జిల్లా తలసరి ఆదాయం రూ.2,48,275తో రెండవ స్థానంలో, మేడ్చెల్-మల్కాజగిరి జిల్లా రూ. 1,48792తో మూడో స్థానంలో వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక అవుట్ లుక్ 2018లో పేర్కొంది. కనిష్ట తలసరి ఆదాయం రూ. 61,725తో నాగర్‌కర్నూలు జిల్లా ఉంది. సంగారెడ్డి జిల్లా రూ.1,34,958, పెద్దపల్లి జిల్లా రూ.1,05,123తో, భద్రాద్రి కొత్త గూడెం జిల్లా రూ.1,01,652 మేరకు తలసరి ఆదాయంతో ఉన్నాయి.
మిగిలిన జిల్లాలను విశే్లషిస్తే ఆదిలాబాద్ జిల్లా రూ. 71,266, కొమురంభీం జిల్లా రూ. 77825, మంచిర్యాల రూ. 83,352, నిర్మల్ జిల్లా 72,013తో, జగిత్యాల రూ.66290, జయశంకర్ జిల్లా రూ. 82,886, మహబూబాబాద్ జిల్లా రూ.74,684, వరంగల్ రూరల్ రూ. 74,639, వరంగల్ అర్బన్ రూ. 70,183, కరీంనగర్ జిల్లా రూ. 89,163, రాజన్న సిరిసిల్ల జిల్లా రూ.72,548, కామారెడ్డి జిల్లా రూ. 63,948తో, మెదక్ జిల్లా రూ. 81,242, సిద్ధిపేట జిల్లా రూ.92,412, జనగాం జిల్లా రూ. 72665, యాదాద్రి భువనగిరి జిల్లా రూ. 97,953, వికారాబాద్ జిల్లా రూ.64,533, మహబూబ్‌నగర్ జిల్లా రూ. 67,328, జోగులాంబ గద్వాల్ జిల్లా రూ.72,484, వనపర్తి జిల్లా రూ. 69,135, నల్లగొండ జిల్లా రూ. 77,912, సూర్యాపేట రూ. 85608, ఖమ్మం జిల్లా రూ. 79618 తలసరి ఆదాయంతో ఉన్నాయి.