తెలంగాణ

ఉద్యోగాల భర్తీపై శే్వతపత్రం విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: నిరుద్యోగులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, లక్షా 68 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని లెక్కలు చెప్పారని కనుకుల శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.
ఈ ఖాళీలను భర్తీ చేయాలని ఉద్యమం సమయంలో కేసీఆర్ డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. అయితే టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఖాళీ ఉద్యోగాల సంఖ్య ఉన్నఫలంగా ఎలా తగ్గాయని ఆయన ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీ ఉద్యోగాల సంఖ్య 1,12,400 అని చెప్పారని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టి నాలుగేళ్లు దాటినా ఇప్పటి వరకు ఖాళీ ఉద్యోగాల్లో నాలుగవ వంతు కూడా భర్తీ చేయలేదని ఆయన విమర్శించారు. ఉద్యోగాల భర్తీ చేయకుండా నోటిఫికేషన్లు ఇవ్వడం, అందులో లోపాలు ఉండడంతో కోర్టుకు వెళ్లడం, అవి నిలిచిపోవడం జరుగుతోందని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ఒక లక్షా 12 వేల ఉద్యోగాల్లో ఇప్పటి వరకు వివిధ శాఖల్లో 21,473 ఖాళీలను భర్తీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయని ఆయన తెలిపారు. అసలు ఖాళీలెన్ని, వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్నో శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలను, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు టి.జెఎసి చైర్మన్ ఎం. కోదండరామ్ సభ నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతినివ్వకుండా నిరంకుశంగా వ్యవహరించిందని కనుకుల దుయ్యబట్టారు.