తెలంగాణ

మన ఇల్లు, మన కూరగాయల పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: హైదరాబాద్‌లో ఇళ్లపై ‘మన ఇల్లు-మన కూరగాయలు’ పథకాన్ని ప్రారంభించామని రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్. వెంకటరామిరెడ్డి తెలిపారు. ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, నగరంలో 30 లక్షల ఇళ్లు ఉండగా, వీటిలో ఐదువేల ఇళ్లపైగాన ఈ పథకం కింద ఆకుకూరలు, కాయగూరలసాగు జరుగుతోందన్నారు. ప్రతి వ్యక్తికి రోజూ 280 గ్రాముల కాయగూరలు అవసరం ఉంటుందన్నారు. ఈ పథకం కింద ఇళ్లపై పండించే కాయగూరలకు ఉద్యాన శాఖ ప్రోత్సాహం అందిస్తుందన్నారు. దీనివల్ల తాజా కూరగాయలు గృహస్థులకు లభిస్తాయని, రసాయనాలు లేని కూరగాయలు పండించేందుకు వీలుంటుందన్నారు. కూరగాయల్లో గోంగూర, పాలకూర, మెంతికూర, తోటకూర, బీరకాయ, వంకాయ, టమాట, బెండ, కాకర, దోసకాయ, ఆనపుకాయ, పొట్ల తదితర పంటలు పండించేందుకు వీలుంటుందన్నారు. ఇలా ఉండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు 17 నర్సరీల ద్వారా 20 లక్షల మొక్కలను హరితహారం కింద నాటేందుకు పంపిణీ చేశామని వెంకటరామిరెడ్డి తెలిపారు.