తెలంగాణ

రైతులకు సాయం మా ఘనతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణలో 72,13,111 మంది రైతులకు వానాకాలం పంటలకు వచ్చే నెల 20వ తేదీ నుంచి మే నెలాఖరు వరకు, రబీ పంటకు నవంబర్ 20వ తేదీ నుంచి పెట్టుబడి సాయాన్ని అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రపంచం మొత్తం మీద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించే ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. మంగళవారం అసెంబ్లీలో టీఆర్‌ఎస్ సభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి, పుట్టా మధుకర్, వేముల వీరేశం తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ గతంలో రైతుల నుంచి ప్రభుత్వాలు శిస్తులు వసూలు చేసేవన్నారు. కాని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తోందన్నారు. ఎకరానికి ఒక పంటకు రూ.4వేలు, రెండు పంటలకు రూ. 8 వేల చొప్పున ఇస్తుందన్నారు. ప్రతిగ్రామానికి వెళ్లి రైతులకు చెక్‌లను స్థానిక ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేస్తారన్నారు. ఎస్‌బిఐ, ఆంధ్రాబ్యాంకు, కెనరా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్, సిండికేట్ బ్యాంకు ద్వారా ఆర్డర్ చెక్‌లు ఇస్తామన్నారు. చెరుకుపంట ఏడాది కాలమని, రెండు పంటలుగా లెక్కవేసి పెట్టుబడి సాయాన్ని రైతులకు ఇస్తామన్నారు. రాష్ట్రంలో 96 శాతం వివాద రహిత, 4 శాతం వివాద భూములు ఉన్నాయన్నారు. వివాద భూముల సంగతి తేలిన తర్వాత ఆ కేటగిరీలో ఉన్న భూమల రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.12వేల కోట్లను పంపిణీ చేస్తామన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన కింద 72,13,111 మంది రైతులు లబ్ధిపొందనున్నారని చెప్పారు. గతంలో అందరు రాజులు రైతుల నుంచి శిస్తులు వసూలు చేసే వారని, కాని రైతులకు పెట్టుబడి సాయం అందించే రాజుగా కేసీఆర్ చరిత్రలో ఎక్కుతారని శ్లాఘించారు.