తెలంగాణ

జాతీయ రహదారులకు 147.71 హెక్టార్ల సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత జాతీయ రహదారుల నిర్మాణానికి 147.71 హెక్టార్ల భూమిని సేకరించినట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
భూసేకరణ కేంద్ర జాతీయ రహదారుల సంస్థ చేపడుతుందన్నారు. అసెంబ్లీలో మంగళవారం బిజెపి సభ్యులు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1333 కి.మీ పొడువును జాతీయ రహదారులుగా ప్రకటించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 1767 కి.మీ పొడువు గల 13 రాష్ట్ర రోడ్లను కొత్త జాతీయ రహదారులుగా ప్రకటించేందుకు కేంద్రం సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని చౌటుప్పల్‌లో కొత్త డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు.
టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ప్రభుత్వం ఈ విషయాన్ని చురుకుగా పరిశీలిస్తోందని, త్వరలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తుమ్మల తెలిపారు.
రైతు వేదిక భవనాలు: పోచారం
రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్రంలో 2638 క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు , ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక ఎఇవోను నియమించినట్లు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ప్రతి క్లస్టర్ నిర్మాణానికి రూ.12లక్షల చొప్పున రైతు వేదిక భవనాలను నిర్మిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2638 క్లస్టర్ల నిర్మాణానికి రూ.300 కోట్లను ఖర్చుపెట్టనున్నట్లు ఆయన చెప్పారు.