తెలంగాణ

శంషాబాద్ విమానాశ్రయానికి పదేళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, మార్చి, 23 శంషాబాద్ రాజీవ్‌గాంధీ అం తర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమై నేటికి పదేళ్లు పూర్తికావడంతో జీఎంఆర్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం శంషాబాద్ ఎయి ర్ పోర్టులో పదేళ్ల వార్షికోత్సవాలు అట్టహాసంగా జరిగా యి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎయిర్ పోర్టు సిటీ విస్తరణ పనులకు భూమి పూజ చే శారు. అనంతరం నగరంలో రాజ్యసభ ఎన్నికలు ఉండడంతో మాట్లాడకుండానే నగరానికి బయలుదేరారు.
మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మాట్లాడుతూ శంషాబాద్ విమానాశ్ర యం ప్రాంగణంలో దాదాపు 600 ఎకరాల స్థలంలో ని ర్మించనున్న ఎయిర్ పోర్టు సిటీ ప్రాంగణంలో ప్రపంచ స్థాయి సదస్సులు, ఎగ్జిబిషన్ హాల్స్, స్టార్ హోటళ్లు, భారీ వాణిజ్య సముదాయాలు, ఆస్పత్రులు, విశాలమైన పార్కింగ్ తదితర పనులకు నిర్మించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ సంస్థ అధినేత మ ల్లికార్జున్‌రావు, గ్రంధి కిరణ్, సీఈవో కిశోర్, కేంద్ర పౌర విమానాయనా శాఖ కార్యదర్శి నయన్ చౌదీ, మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, తీగల కృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..శంషాబాద్ విమానాశ్రయం దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు