తెలంగాణ

ఎన్‌ఐఓఎస్ పరీక్ష బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మార్చి 24: సాక్షరభారత్ ఆధ్వర్యంలో వయోజనులకు ఆదివారం నిర్వహించనున్న ఎన్‌ఐఓఎస్ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా బహిష్కరిస్తున్నట్టు వయోజన విద్య గ్రామ, మండల కో ఆర్డినేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టీ.గోపాల్ వెల్లడించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 8707 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 2.75 లక్షల మందికి పరీక్ష నిర్వహించాల్సి ఉందని, సాక్షరభారత్ కార్యక్రమంలో భాగంగా గ్రా మ కో ఆర్డినేటర్లు 17,714, మండల కో ఆర్డినేటర్లు 437 మంది ఏకపక్షంగా పరీక్షను బహిష్కరిస్తున్నామని ప్రకటంచారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు విధులో పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై వయోజన విద్య రాష్ట్ర సంచాలకుడికి ఈనెల 21న నోటీసు ఇచ్చామని, గత ఎనిమిదేళ్లుగా గౌరవ వేతనాలు పెంచుకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆరోపించారు. మండల, గ్రామ కో ఆర్డినేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సాక్షరభారత్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే నిర్వహించాలని, వృత్తి నైపుణ్య శిక్షణతో అమలు చేయాలని, ఓపెన్ స్కూల్ కేంద్రాల నిర్వహణ బాధ్యతను అన్ని అర్హతలు(డిగ్రి, బీఈడీ, పీజీ) ఉన్న మండల కో ఆర్డినేటర్లకు అప్పగించాలని, బకాయ వేతనాలు చెల్లించి, టీఏ, డీఏ, ఎప్‌టీఏ చెల్లించాలని, మండల కో ఆర్డినేటర్లకు రూ.6000ల నుంచి రూ.25000, గ్రామ కో ఆర్డినేటర్లకు రూ.2000 నుంచి రూ.12500లకు పెంచాలని, ప్రయాణభత్యాన్ని రూ.500 నుంచి రూ. 3000కు పెంచాలని, కొత్త జిల్లాల ప్రకారమే గౌరవ వేతననాలు ప్రతినెలా చెల్లించాలని, వయోజన విద్యాశాఖలో ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్ పోస్టులను మండల కో ఆర్డినేటర్లతో భర్తీ చేయాలని, వయోజన విద్యా విధానం లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలని, రాష్ట్రంలో 8707 వయోజన విద్యా కేంద్రాలు, 52 ఆదర్శ వయోజన విద్యా కేంద్రాలను మినీ గ్రంథాలయాలుగా గుర్తించాలని, వయోజన విద్యా కేంద్రాల్లో వినియోగదారుల సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామ కోఆర్డినేటర్ల ద్వారా గ్రామ ప్రజలకు అవసరమయ్యే సమాచారాన్ని అందుబాటులో ఉంచడానికి అవకాశం ఉం టుందని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల కో ఆర్డినేటర్లను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్, అంబర్‌పేట్, తదితర ప్రాంతాలకు తరలించి కనీసం మంచినీటి అందించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు.