తెలంగాణ

రాష్ట్రంలో చైనా పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 24: వరంగల్‌లో తమ కంపెనీలు భాగస్వామ్యం తప్పక ఉటుందని, చైనా చాంబర్ ఆఫ్ కామర్స్, మిషనరీ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ ప్రతినిధి బి.యోంగ్ హాంగ్ అన్నారు. వరంగల్‌లో జరుగుతున్న స్మార్టుసిటీ పనులు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను అధ్యయనం చేయడానికి చైనాలో పేరుపొందిన వివిధ కంపెనీల బృందం శనివారం వరంగల్‌కు విచ్చేసింది. మొదట రాంపూర్ డంపింగ్ యార్డు ను పరిశీలించారు. నగరంలో జరుగుతున్న స్మార్ట్‌సిటీపనులను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులను, మానవ మల, మూత్ర వ్యర్ధాల శుద్ధీకరణ ప్లాంటు గురించి , ప్రధాన నాలాల సుందరీకరణ, స్మార్ట్ రోడ్స్, సోలార్ ప్లాంట్ లాంటి అభివృద్ధి పనులు ఏవిధంగా జరుగుతున్నాయో చైనా కంపెనీల బృందం పరిశీలించింది. చైనా ప్రతినిధి యోంగ్ హాంగ్ మాట్లాడుతూ త్వరలోనే ఇక్కడి పరిస్ధితులకు, వాతవరణాలకు తగ్గట్టుగా తమ వ్యాపార కార్యకలపాలను ప్రారంభిస్తామని తెలిపారు.