తెలంగాణ

విహార యాత్రలా కాంగ్రెస్ బస్సు యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన బస్సు యాత్ర విహారయాత్రను తలపిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ ఏ మేరకు అభివృద్ధి చేసిందో చెప్పగలరా అని ప్రశ్నించారు. బస్సు యాత్ర పేరుతో విహార యాత్రలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు మరో మారు తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరవేస్తోందన్నారు. కుల వృత్తుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ఆయా వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతుందని చెప్పారు. షాదిముబారక్, కళ్యాణలక్ష్మి పథకం ద్వారా పేద యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. ఓ వైపు భారీ నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మిస్తూనే మరోవైపు మిషన్ కాకతీయ ద్వారా వేలాది ఏకరాలను సాగులోనికి తీసుకువస్తున్నది నిజం కాదా, మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు శుద్ధజలాలు అందించడం లేదా అని నిలదీశారు. వాస్తవాలు గుర్తించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. కోదండరామ్ పార్టీ గురించి ఓ విలేఖరి ప్రశ్నించగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చునని అన్నారు.