తెలంగాణ

టీఎస్‌ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీగా కొమురయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొమురయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్‌గా, ఓ అండ్ ఈ చీఫ్ మేనేజర్‌గా ఆయన పని చేసి పదోన్నతిపై ఈడీగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎండి జీవీ రమణారావును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎండీ ఆయనకు అభినందనలు తెలిపారు. బస్ సర్వీసుల ఆక్యుపెన్సీ రేషియో పెంపునకు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని ఎండీ అన్నారు.

చిత్రం.. టీఎస్‌ఆర్టీసీ ఎండీ జివి రమణారావును మర్యాదపూర్వకంగా కలిసిన ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొమురయ్య