తెలంగాణ

గౌడ కార్పొరేషన్ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: రాష్ట్రంలో గౌడ కులస్తుల ఆర్థికాభివృద్ధికి గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గౌడ మేధావులు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. సోమవారం ఇక్కడ గౌడ మేధావులు, ఉద్యోగులు, నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ జీ రాజేశంగౌడ్ మాట్లాడుతూ, గౌడ కులాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అనేక పథకాలు, కార్యక్రమాలు ప్రారంభించారన్నారు. గౌడ భవనానికి హైదరాబాద్‌లో ఐదెకరాల స్థలం ఇవ్వడంతో పాటు ఐదుకోట్ల రూపాయలు కేటాయించినందువల్ల కేసీఆర్‌కు గౌడ కమ్యూనిటీ రుణపడి ఉంటుందన్నారు. గీతకార్మికులు చెట్లు ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు మరణించినా, గాయపడ్డా ఐదులక్షల వరకు పరిహారం ఇవ్వాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని శ్లాఘించారు.
గౌడ కులం సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని శాసనమండలి చైర్మన్ కే స్వామిగౌడ్ పేర్కొన్నారు. గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ను అందరం కలిసి కోరదామని ఈ సందర్భంగా స్వామిగౌడ్, రాజేశం గౌడ్ సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, తెలంగాణ రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాలకూరు వెంకటేశం గౌడ్, తెలంగాణ గౌడ సమన్వయ సంఘం చైర్మన్ శేషగిరిరావు, అధ్యక్షుడు బాల్‌రాజ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.