తెలంగాణ

తల్లిదండ్రుల నిరసనతో దిగివచ్చిన ‘వాసవి’ యాజమాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచి, విద్యార్థుల నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ముకుతాడు వేస్తున్నారు. అదనంగా ఫీజు చెల్లించమని కోరితే చెల్లించవద్దని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రుల సంఘాల ప్రతినిథులు కోరుతున్నారు. వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో తల్లిదండ్రులు సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకూ ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు తెలంగాణ తల్లిదండ్రుల సంఘం మద్దతు పలికింది. అదనపు ఫీజులు వసూలు చేయడం దారుణమని తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ, కార్యదర్ళి పగడాల లక్ష్మయ్య పేర్కొన్నారు. వాసవి ఇంజనీరింగ్ కాలేజీ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు శ్రీనాధ్, కార్యదర్శి వెంకటేశ్వరరావు, పద్మారెడ్డి, వెంకటయ్య తదితరులతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తిరుపతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంట పాటు తల్లిదండ్రుల సంఘం నాయకులు ధర్నా చేయడంతో కాలేజీలో ఉన్న విద్యార్ధులు కూడా తరగతులు బాయ్‌కాట్ చేసి వచ్చేశారు. కాలేజీ ప్రాంగణంలోనే ర్యాలీ నిర్వహించారు. ఫీజుల పెంపును విరమించుకోవాలని, పరీక్ష ఫీజులు చెల్లించేందుకు అవకాశం ఇవ్వాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో దిగివచ్చిన యాజమాన్యం తల్లిదండ్రులతో చర్చలు జరిపింది. అదనపు ఫీజు వసూలు చేయకుండానే 2016-17 బ్యాచ్ విద్యార్థులు తమ పరీక్ష ఫీజులను చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్టు కాలేజీ యాజమాన్యం ప్రతినిధి పెండేకంటి రామమోహనరావు చెప్పారు. దీంతో కాలేజీ యాజమాన్యంతో గత కొద్ది కాలంగా కొనసాగుతున్న పోరుకు తెరదించినట్టయింది. ఇదే బాటలో మరికొన్ని కాలేజీలు సైతం అదనపు ఫీజులకు డిమాండ్ చేస్తున్నాయని, అలా డిమాండ్ చేస్తే అదనపు ఫీజులు చెల్లించవద్దని తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు ఎన్ నారాయణ హితవుపలికారు.