తెలంగాణ

‘కాగ్’పై కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: ‘కాగ్’ నివేదికపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడో మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడో మాట మాట్లాడటం కాంగ్రెస్ నేతల రెండు నాలుకల ధోరణికి నిదర్శనమని మంత్రి మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఎమ్మెల్సీ గువ్వల బాల్‌రాజు, ఎమ్మెల్సీలు బొడకుంట్ల వెంకటేశ్వర్లు, పాతూరి సుధాకర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాగ్ తప్పు పట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ అయితే కాగ్ నివేదికను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పార్లమెంట్‌లోనే స్పష్టం చేశారని మంత్రి గుర్తు చేశారు. కాగ్ ఏమైనా బైబిలా, భగవద్గీతా అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ఆర్‌తో పాటు కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కాగ్ నివేదికపై ప్రస్తుతం రాద్ధాంతం చేస్తున్న జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ అప్పుడు మంత్రులుగా ఉన్నారన్నారు. ప్రస్తుత ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రూ.23 వేల కోట్ల అవినీతి జరిగిందని ‘కాగ్’ బయటపెట్టగా దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారని హరీశ్‌రావు వివరించారు. కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా కాగ్ పలు లోపాలను ఎత్తిచూపిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక రకంగా తమ రాష్ట్రాల్లో మరొకరకంగా కాగ్ నివేదిక ఇచ్చిందని కాంగ్రెస్ ముఖ్యమంత్రులే ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలో చేసిన అప్పులను పెట్టుబడులుగా చూపిన కాగ్ తెలంగాణలో మాత్రం అప్పులుగా చూపిందన్నారు. తెలంగాణలో అవినీతి జరుగుతోందని కాగ్ ఎక్కడా తప్పుపట్టలేదని గుర్తు చేశారు. కేవలం సాంకేతిక అంశాలపై మాత్రమే కాగ్ టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టిందని మంత్రి వివరించారు. అప్పులు, పెట్టుబడులను కాగ్ లెక్కిస్తున్నప్పుడు పరిగణనలోకి తీసుకుంటున్నప్పుడే ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి సిఎం కేసీఆర్ తీసుకెళ్లారన్నారు.
బస్సు యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేతలు అధికార దాహంతో హామీలు గుప్పిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఇక్కడ వారు ఇస్తున్న హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని మంత్రి నిలదీశారు. వారు చేస్తున్నది బస్సుయాత్ర కాదని అధికార యావ యాత్రగా మంత్రి అభివర్ణించారు. కాంగ్రెస్ బస్సుయాత్రలో నాయకులు ఎక్కువ, జనాలు తక్కువ అని మంత్రి ఏద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలను ప్రజలను నమ్మెపరిస్థితి లేదని విమర్శించారు.
మన సీఎం చంద్రబాబు!
మీడియా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, పొరపాటున ‘మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు’ అని వ్యాఖ్యానించి నాలుక కరుచుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలో అప్పులను పెట్టుబడులుగా చూపిన కాగ్ తమ రాష్ట్రంలో మాత్రం అలా కుదరదని చెప్పడంతో ఈ విషయాన్ని స్వయంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...సారీ...మన ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లారని హరీశ్‌రావు నోరుజారారు.

చిత్రం..తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు