తెలంగాణ

వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన ప్రణాళికలను రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పేర్కొన్నారు. వాతావరణ మార్పులు-సమాజంపై ప్రభావం అన్న అంశంపై మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ, ప్రకృతిలో మనం ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల వైపరీత్యాలు సంభవిస్తున్నాయన్నారు. రాను రాను భూఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, దాని ప్రభావం వర్షాలు తదితరాలపై పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఈపీటీఆర్‌ఐ) డైరెక్టర్ జనరల్ బి. కళ్యాణ చక్రవర్తి తదితరులు మాట్లాడారు.