తెలంగాణ

ఫెలోషిప్‌ల విడుదలలో కేంద్రం నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: రీసెర్చి విద్యార్థులకు ఫెలోషిప్‌ల విడుదలలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరికి నిరసనగా ఏబీవీపీ నేతలు మంగళవారం నాడు ఉస్మానియా యూనివర్శిటీలో తీవ్ర ఆందోళన, ర్యాలీ నిర్వహించారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఎప్పటిపుడు నిధులను విడుదల చేయాల్సి ఉన్నా, పట్టించుకోవడం లేదని ఏబీవీపీ సిడబ్ల్యుసి సభ్యుడు మట్ట రాఘవేందర్ ఆరోపించారు. పరిశోధక విద్యార్థులు అందరికీ వెంటనే ఫెలోషిప్‌లు అందించాలని, బిఎస్‌ఆర్, ఆర్‌ఎంఎస్‌ఎస్ ఫెలోషిప్‌లను వెంటనే పునరుద్ధరించాలని, ఎన్‌ఎఫ్‌ఎస్‌టి, ఎన్‌ఎఫ్‌ఎస్‌సి, బిఎస్‌ఆర్, సింగిల్ గర్ల్ చైల్డు ఫెలోషిప్‌లను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎబివిపి నేతలు ఒయు ఆర్ట్సు కాలేజీ నుండి ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రధాన రహదారిపై నిరసన ధర్నా చేపట్టారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.