తెలంగాణ

సిగరెట్ల దిగుమతులు నిషేధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్న విదేశీ సిగరెట్లపై దర్యాప్తు జరపాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, గుజరాత్‌రాష్ట్రాలకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్ అసోసియేషన్స్ (ఫైఫా) కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఫైఫా ప్రధాన కార్యదర్శి మురళి బాబు ప్రకటన విడుదల చేశారు. పొగాకు పంట సాగుకు ప్రతికూల వాతావరణం నెలకొని ఉందని, అనవసరమైన నియంత్రణలు అమలు చేస్తున్నారని, దీని వల్ల పొగాకు రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. బహుళ జాతి కంపెనీలు దేశంలోకి విదేశీ సిగరెట్ల స్మగ్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయన్నారు. గత మూడు సంవత్సరాలుగా పొగాకు రైతులు రూ.3650 కోట్ల ఆదాయాన్ని కోల్పోయారని తెలిపారు. పొగాకు పరిశ్రమలో విదేశీపెట్టుబడులను నిషేధించాలన్నారు.