తెలంగాణ

దళితులపై దాడులకు బిజెపి, కాంగ్రెస్‌దే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: భారత్ బంద్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై బిజెపి,కాంగ్రెస్‌లు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకుంటున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి టి హరీశ్‌రావు విమర్శించారు. దళితులను వేధించిన సంఘటనలపై దేశంలో సాలీనా 45 వేల కేసులు నమోదు అవుతున్నాయంటే దానికి కాంగ్రెస్, బీజేపీలదే బాధ్యతన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ, భారత్ బంద్ సందర్భంగా తొమ్మిది మంది మరణించడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. మృతుల కుటుంబాలకు టిఆర్‌ఎస్ పక్షాన తీవ్ర సంతాపం తెలుపుతున్నామన్నారు. కాంగ్రెస్, బిజెపీలు దేశాన్ని డెబ్బయి ఏళ్లుగా పాలిస్తున్నా దళితులకు న్యాయం జరగడం లేదన్నారు.
దళితులపై అత్యాచారాల్లో రాజస్తాన్ మొదటి స్థానంలో, బీహార్ రెండో స్థానంలో, మధ్యప్రదేశ్ మూడవ స్థానంలో ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. దళితులపై దాడులు ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా జరగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని కోరుతున్నారంటే దానికి దళితులపై జరగుతున్న దాడులే ప్రధాన కారణమన్నారు. దళితులకు ఊరట ఇచ్చేందుకు ప్రధాన మంత్రి వెంటనే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో చర్చించాలని హరీశ్‌రావు అన్నారు.

చిత్రం..తెలంగాణ భవన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు