తెలంగాణ

ప్రముఖ శాస్త్ర విజ్ఞాన సంస్థకు శివాజీరావు పేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, శాస్తవ్రేత్త, విద్యావేత్త ప్రొఫెసర్ టి శివాజీరావు పేరును రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శాస్త్ర విజ్ఞాన సంస్థకు నామకరణం చేయాలని మంగళవారం నాడిక్కడ జరిగిన శివాజీరావు సంతాప సభలో పలువురు డిమాండ్ చేశారు. ఇటీవల మరణించిన ప్రొఫెసర్ టి శివాజీరావు సంతాప సభను హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి ఫౌండేషన్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ సంస్థలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి , మాజీ ఐఎఎస్ అధికారి విద్యాసాగరరావు, సాక్షి టివి సంపాదకుడు దిలీప్‌రెడ్డి, ఎన్‌డిఎంఎ మాజీ సభ్యుడు మర్రి శశిధర్‌రెడ్డి, డాక్టర్ సుబ్బారావు, చెన్నూరి శివప్రసాద్, స్మృతి తదితరులు మాట్లాడగా, ప్రపంచ ప్రసిద్ధ పర్యావరణ నిపుణుడు ఎంసి మెహతా లేఖ ద్వారా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రొఫెసర్ టి శివాజీరావు సేవలను కొనియాడారు. శివాజీరావు సేవలను ఇరు ప్రభుత్వాలూ గుర్తించాలని, ఆయన సేవలకు చిహ్నంగా ఆయన పేరిట ఒక పురస్కారం నెలకొల్పాలని, ఒక ప్రముఖ సంస్థకు ఆయన పేరును పెట్టాలని కోరారు. ఏ సౌకర్యాలూ లేని రోజుల్లోనే తాజ్‌మహల్‌కు కాలుష్యం ముప్పును ఆయన వెల్లడించారని దిలీప్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ కేంద్రాలు, మరీ ముఖ్యంగా అణు విద్యుత్ కేంద్రాల కాలుష్య ముప్పును ఆయన విడమరిచి చెప్పారని, ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయని శివాజీరావు చెప్పారో అవే ఘటనలు జపాన్‌లో జరిగాయని ఆయన పేర్కొన్నారు. కేరళలో విద్యుత్ ప్లాంట్‌ల విషయంలో ముందస్తుగానే ఆయన జనచైతన్యం తీసుకువచ్చారని, విశాఖ నగరంలోనూ, హైదరాబాద్‌లోనూ వాయు కాలుష్యంపై విస్తృతమైన ప్రచారం చేశారని, పోలవరం డిజైన్లు మార్చాలని, అలాగే అలమట్టి డ్యాం ముప్పును కూడా ఆయన సరళమైన భాషలో చెప్పారని, న్యూక్లియర్ ప్లాంట్‌ల భద్రత గురించి తీసుకోవాల్సిన చర్యలను కూడా చెప్పారని, తెహ్రీ డ్యాం ఒక టైం బాంబ్ వంటిదని చెప్పారని దిలీప్‌రెడ్డి అన్నారు. వక్తల ఉపన్యాసాలకు శివాజీరావు మనుమరాలు స్మృతి కృతజ్ఞతలు చెప్పారు. మాజీ ఐఎఎస్ అధికారి విద్యాసాగరరావు శివాజీరావుపై రాసిన ఒక గీతాన్ని ఆలపించారు. క్లౌడ్ సీడింగ్ ప్రతిపాదనను తొలుత తీసుకువచ్చింది ఆయనేనని విద్యాసాగరరావు అన్నారు. ఎంసి మెహతా పంపించిన సందేశాన్ని ప్రొఫెసర్ టి పురుషోత్తంరెడ్డి చదివి వినిపించారు. శివాజీరావు మరణం దేశానికి మేథోసంపన్నమైన నష్టమని మెహత కొనియాడారు. శశిధరరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ జాగ్రత్తలు తీసుకోకుంటే మానవజాతి మనుగడకే ముప్పువాటిల్లుతుందని చెప్పారు. పోలవరం వంటి అనాలోచిత నిర్మాణాలు కాంట్రాక్టర్ల మెప్పు కోసం, డబ్బు కోసం చేస్తున్నారని ఆరోపించారు. గోపాలరావు మాట్లాడుతూ పార్కులను పరిరక్షించుకోవాలన్నా నేడు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన చెందారు. పర్యావరణ చైతన్యం తీసుకువచ్చిందే ప్రొఫెసర్ శివాజీరావు అని అన్నారు. లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సమాజం గురించి ఆలోచించి శివాజీరావు మార్గనిర్దేశనం చేశారని చెప్పారు. కే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కేజీ నుండి పీజీ వరకూ పర్యావరణంపై పాఠ్యాంశాలను చేర్చాలని అన్నారు. సుబ్బారావు మాట్లాడుతూ నిన్ను నువ్వు రక్షించుకో అని సుబ్బారావు చెప్పారని అన్నారు. చెన్నూరి శివప్రసాద్ మాట్లాడుతూ శివాజీరావు పేరిట ఒక అవార్డు నెలకొల్పాలన్నారు.