తెలంగాణ

కోదండరామ్ వెనకున్నది ఎవరో తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: ప్రగతి భవన్ గడీని బద్దలు కొడదాతామని కోదండరామ్ చేసిన వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్ తీవ్రంగా మండిపడింది. ప్రగతి భవన్ గడీ కాదు, అది ప్రజల భవన్, కోదండరామ్ వెనక ఎవరు ఉండి ఇలాంటి పనికిమాలిన మాటలను మాట్లాడిస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ మండిపడ్డారు. టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీ రాములు నాయక్ మీడియాతో మాట్లాడుతూ, పేద ప్రజలు దేవాలయంగా భావించే ప్రగతి భవన్‌ను గడీ అని వ్యాఖ్యనించడం సిగ్గు చేటన్నారు. అసలు గడీ గాంధీ భవనేనన్నారు. దొరలంతా గాంధీ భవన్‌లో కూర్చొని పేద ప్రజలకు మేలు జరగుతుంటే చూసి ఓర్వలేక విషం కక్కుతున్నారని దుయ్యబట్టారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 86 సీట్లు వస్తాయని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పగటి కలలు కంటున్నారని విమర్శించారు. సాధారణ ఎన్నికల దాకా ఎందుకు? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 86 గిరిజన గ్రామ పంచాయతీలు గెలుచుకోండి చూద్దామని రాములు నాయక్ సవాల్ చేశారు. దళితులు, గిరిజనులపై మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వర్గాలకు ఏమి చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. ఈ వర్గాలను ప్రలోభాలకు గురి చేసి గెలుస్తామని పరోక్షంగా చెప్పడమే అవుతుందని రాములు నాయక్ తప్పుపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన నడస్తుందని కాంగ్రెస్ నాయకులు పదే పదే విమర్శిస్తున్నారని, అసలు కాంగ్రెస్‌లోనే కుటుంబ పాలన కొనుసాగుతుందన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన భార్య పద్మావతి, కోమటిరెడ్డి బ్రదర్స్, మల్లు బ్రదర్స్, సబితి ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి మరీ వీరినేమి అంటారు, కుటుంబ పాలన కాదా అని రాములు నాయక్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, మరో 20 ఏళ్ల వరకు టిఆర్‌ఎస్‌దే అధికారమని ఆయన అన్నారు.