తెలంగాణ

వర్షాలతో లక్ష ఎకరాల్లో పంట నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్లతో సుమారు లక్ష ఎకరాల పంట దెబ్బతిన్నదని టీటీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. చేతికి వచ్చిన పంట దెబ్బతిని కుదేలైన రైతులను ఆదుకోవాలని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, పార్టీ ఎమ్మెల్యే సం డ్ర వెంకట వీరయ్య ప్రభృతులు శుక్రవారం వ్యవసాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. 72,632 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని వారు తెలిపారు. అదేవిధంగా 16,785 వేల ఎకరాల్లో మొక్క జొన్న, 7,500 ఎకరాల్లో మామిడి తోట, బత్తాయి, నిమ్మ తోటలు దెబ్బ తిన్నాయని వారు తెలిపారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 32వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వారు వివరించారు. ఖమ్మం జిల్లాలో 29 వేల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, గ్రీన్ హౌస్ నిర్మాణాలు కూలిపోయాయని పేర్కొన్నారు. తెగుల వల్ల నష్టపోయిన వరి, కంది రైతులను ఆదుకోవడానికి వెంటనే చర్యలు చేపట్టాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.