తెలంగాణ

మేథోసంపత్తి హక్కులపై 28న హైదరాబాద్‌లో జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: మేధోసంపత్తి హక్కులలోని వివాదాలను పరిష్కరించే అత్యుత్తమ పద్ధతులు అనే అంశంపై ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్‌నేటివ్ డిస్ప్యూట్స్ రిసొల్యూషన్ సంస్థ( ఐసీఏడీఆర్) ఈ నెల 28న జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. ఐసీఏడీఆర్ సంస్థ ఆర్బిట్రేషన్ పద్ధతులను ప్రచారం చేయడానికి 1998లో స్థాపించడం జరిగిందని సంస్థ ప్రాంతీయ కార్యదర్శి జేఎల్‌ఎన్ మూర్తి చెప్పారు. చిన్నతరహా, మధ్యతరహా సంస్థల్లో శాస్త్ర పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ఉన్న వారికి డిజైన్ రంగంలో ఉన్న వారికి , న్యాయ , ఐపీఆర్ రంగాల్లో పనిచేస్తున్న వారికి అడ్వకేట్లు, సీఏలు, కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న , బహుళ జాతి సంస్థల్లో పనిచేస్తున్న వారు ఎవరైతే సమస్యలను పరిష్కరించదలుచుకుంటారో వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని ఆయన సూచించారు.