తెలంగాణ

బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంటుల్లో బీసీ బిల్లు పెట్టి ఆమోదించాలని ఎపీ బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ డిమాండ్ చేసింది. శుక్రవారం నగరంలో జరిగిన సమావేశానికి 64 బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టపరమైన, రాజ్యాంగపరమైన అడ్డంకులు ఏమీ లేదని అన్నారు. గతంలో పాలించిన కేంద్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం, బీసీ వ్యతిరేక వైఖరి అవలంబించడం వల్లే పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించలేదని విమర్శించారు.