తెలంగాణ

హామీల అమలులో టీఆర్‌ఎస్ విఫలం : లక్ష్మణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని రాజకీయ మార్పు, థర్డ్ ఫ్రంట్ అంటూ కొత్త పాట పాడుతున్న ముఖ్యమంత్రి ఎవరి కోసం మార్పు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల కోసం సీఎం మార్పు కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయబావుట ఎగురవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.