తెలంగాణ

జీహెచ్‌ఎంసీ పరిధిలో 19 చెరువుల పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని 19 చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టడానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజురు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులను చేపట్టడానికి రూ.285.93 కోట్లకు పాలనా అనుమతి ఇచ్చినట్టు నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేసారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ మూడు జిల్లాల పరిధిలోని 19 చెరువుల పునరుద్ధరణ, సమగ్రాభివృద్ధికి ఈ నిధులను మంజురు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణకు ఎంపిక చేసిన చెరువులలో పటెల్ చెరువు (మదీనాగూడ) శేరిలింగంపల్లి మండలం రూ.12.20 కోట్లు, అంబర్‌చెరువు (ప్రగతినగర్) బాలానగర్ మండలం, బోయి న్ చెరువు (హస్మత్‌పేట్) బాలానగర్ మండలం రూ.25.34 కోట్లు, మలకచెరువు (ఉప్పర్‌పల్లి) రాజేంద్రనగర్ మండలం రూ.14.45 కోట్లు, పెద్ద చెరువు (నెక్నాపూర్) రాజేంద్రనగర్ మండలం రూ.21.62 కోట్లు, మలకచెరువు (రాయదుర్గ్) శేరిలింగంపల్లి మండలం రూ.7.89 కోట్లు, పెద్దచెరువు (మదీనాగూడ) శేరిలింగంపల్లి మండలం రూ.19.05 కోట్లు, చర్లపల్లి చెరువు (చర్లపల్లి) ఘట్‌కేసర్ మండలం రూ.12.28 కోట్లు, ముక్కిడి చెరువు (రామకృష్ణాపురం) మల్కాజ్‌గిరి మం డలం రూ.11.82 కోట్లు, నలగండ్ల చెరువు (నలగండ్ల) శేరిలింగంపల్లి మండలం రూ.16.04 కోట్లు, ఊరచెరువు (కాప్రా) కాప్రా మండలం రూ.9.41 కోట్లు, అంతనగనికుంట (షేక్‌పేట) షేక్‌పేట మండలం రూ.6.22 కోట్లు, సూరారం చెరువు (బండ్లగూడ) చంద్రాయన్‌గుట్ట మండలం రూ.8.55 కోట్లు, పెద్ద చెరువు (మన్సురాబాద్) సరూర్‌నగర్ మండలం రూ.7.39 కోట్లు, మద్దెలకుంట (బైరమాల్‌గూడ) సరూర్‌నగర్ మండలం రూ.4.07 కోట్లు, మోహిని చెరువు (అంబర్‌పేట్) అంబర్‌పేట మండలం రూ.10.07 కోట్లు, దుర్గంచెరువు (రాయదుర్గ్) శేరిలింగంపల్లి మండలం రూ.41.46 కోట్లు, నల్లచెరువు (ఉప్పల్) ఉప్పల్ రూ.7.85 కోట్లు, ఫాక్స్ సాగర్ (జీడిమెట్ల) కుత్బులాపూర్ మండలం రూ.42.22 కోట్లు మంజురు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.