తెలంగాణ

ఆచితూచి ఆయుధ లైసెన్స్‌ల జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: తెలంగాణ పోలీస్ శాఖ గన్ లైసెన్సుల జారీలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎంతో అవసరమైతే తప్ప గన్ లైసెన్సులు జారీకి అనుమతి ఇవ్వడం లేదు. గన్ లైసెన్సులు పొం దిన కొంతమంది ఇటీవల ఆత్మరక్షణకు వినియోగించాల్సిన ఆయుధాలను దుర్వినియోగం చేసిన సందర్భాలు ఉండడంతో కొన్ని నెల ల నుంచి గన్‌లైసెన్సుల జారీని కట్టుదిట్టం చేశారు. ఇందుకు అనుగుణంగా నిబంధనలను సైతం కఠి న తరం చేసింది. కేంద్రం 2016 లో తీసుకు వచ్చిన కొత్త నిబంధనలను అనుసరించి జారీ అ యిన గన్ లైసెన్సులన్నింటికీ జాతీయ స్థ్ధాయిలో ఉన్న డేటాబేస్‌కు లింక్ చేసింది. దీంతో అన్ని రాష్ట్రాల్లో ఉన్న గన్ లైసెన్సుదారు లు తమ వివరాలను ‘నేషనల్ డే టాబేస్ ఆర్మ్స్ లైసెన్స్’లో ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకున్నా రు. ఈ ప్రక్రియ దాదాపు ఏడాదికిపైగా జరిగింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో గన్ లైసెన్సుల జారీని ప్రోత్సహించడం లేదు. ప్రోత్సహిస్తే విచ్చలవిడిగా దుర్వినియోగం అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. తమకు ప్రాణభయం ఉందని, తమపై ప్రత్యర్థులు దాడులు చేసి హతమారుస్తారనే భయం ఉందంటూ ఎవరైనా దరఖాస్తు చేస్తే ఆయా కేసు పూర్తి వివరాలను సంబంధిత కమిషనరేట్, లేదా జిల్లా ఎస్పీ పరిధిలో అంతర్గత విచారణ నిర్వహించి, అనంతరం వచ్చిన నివేదికలను బట్టి లైసెన్స్ జారీ చేసేదీ లేనిదీ నిర్థారిస్తారు. కొన్ని నెలల కిందట పాతబస్తీలోని టప్పాచపుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వివాహ వేడుక వద్ద ఒకరు తన లైసెన్స్ రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ సంఘటనపై కేసు నమోదు చేసి లైసెన్సు రద్దు చేశారు. మరో సంఘటనలో నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి తన వద్ద ఉన్న రివాల్వర్ తీసి కొందరిని బెదిరించిన సంగతి తెలిసిందే. ప్రతి రెండేళ్లకోసారి గన్ లైసెన్స్‌లను రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. ఇలా దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు ఉంటే రెన్యువల్‌ను నిలిపివేస్తారు. లైసెన్సు మంజూరు చేసి అనుమతించినప్పుడే గన్ వివరాలు, బుల్లెట్ల సంఖ్య వంటివి రికార్డుల్లో నమోదు చేస్తారు. తిరిగి రెన్యువల్ సమయంలో కూడా వాటిని పరిశీలిస్తారు. బుల్లెట్లు వినియోగించినట్లు గుర్తిస్తే అందుకు తగిన సమాధానం చెప్పాల్సి ఉంటుం ది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సుమారు 4,500 మంది ఆయుధ లైసెన్స్‌లను కలిగి ఉండగా, వీరిలో పశ్చిమ మండ ల పోలీస్ విభాగంలోనే 2,400 మంది లైసెన్సు కలిగి ఉన్నారు. పశ్చిమ మండలం పరిధిలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపే ట వంటి ప్రాంతాలు ఉన్నాయి. వ్యాపారులు, వీఐపీలు, సినీ ప్రముఖలు ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండడం వల్ల ఆయుధ లైసెన్సులు పొందిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. గతంలో రియల్టర్లు, ఒక మాదిరి రాజకీయ నేతలు, మరికొందరు సిఫార్సుల ద్వారా ఆయుధ లైసెన్సులు పొందే వారు. తెలంగాణ ప్రభుత్వం లైసెన్సుల జారీని కఠినతరం చేసింది. కొందరు లైసెన్సులు తీసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. మరికొందరు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్, ఇతర ముఖ్య నగరాలకు వస్తున్నారు. అక్కడ జారీ చేసిన లైసెన్సు కలిగిన ఆయుధాలను ఇక్కడ తమతో ఉంచుకుని దందా చేసిన సందర్భాలు ఉన్నాయి. బీహార్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు నగరంలో దందా చేస్తూ కొందరిని గన్‌తో బెదిరించిన దాఖలాలు ఉన్నాయి. దీంతో కేంద్రం గత ఏడాది మార్చి వరకు ఆయుధ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్కరికి యూ నిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (యుఐఎన్) జారీ చేసింది. ఇందుకు ఎన్‌డీఏఎల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు దరఖాస్తు చేసుకోవడం ఇష్టం లేక రెన్యువల్ చేయించుకోలేదని సమాచారం. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆయుధ లైసెన్సులకు ఈ యుఐఎన్ జారీ చేయడం ద్వారా ఎక్కడ ఉన్నా ఆ ఆయుధం గురించి అక్కడి పోలీసులకు చాలా సులభంగా వివరాలు దొరుకుతాయి. ఇలా వివరాలు దొరకని ఆయుధం ఉంటే అది అక్రమంగా కలిగి ఉన్నట్లే భావించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.