తెలంగాణ

ఫెడరల్ ఫ్రంట్ విఫలం తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘకరీంనగర్ టౌన్, ఏప్రిల్ 6: రాష్ట్ర జనాభాలో కేవలం నాలుగు శాతం మాత్రమే ఉన్న సామాజిక వర్గం బడుగు, బలహీన వర్గాలను అణచివేతకు గురిచేస్తూ రాజ్యాధికారం కొనసాగిస్తోందని, దీనిని దేశవ్యాప్తం చేసే క్రమంలో ఫెడరల్ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టబోతున్నారని సాంస్కృతిక ఫెడరలిజం అధికంగా ఉన్న దేశంలో ఈ ఫ్రంట్ ఫెయిల్యూర్ కావటం తథ్యమని ప్రజాయుద్ధ నౌక గద్దర్ జోస్యం చెప్పారు. ‘పాటకు పునర్జన్మ’ అనే నినాదంతో పలు సాంస్కృతిక, కుల సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో 92 శాతం ఉన్న బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలను ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటూ అగ్ర వర్ణాలు పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. దేశానికి స్వాతం త్య్రం సిద్ధించిన ఏడు దశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రంలో బీసీ కులాలకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదని, దీనికి కార ణం రాజ్యాంగం అమలులో పాలకులు అనుసరిస్తున్న నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. రాజకీయ మార్పుతోనే బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమని అన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న గద్దర్