తెలంగాణ

పాలమూరుపై ప్రకృతి కనె్నర్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 8: తరుచూ కరువుకాటకాలు, వలసలు ఏళ్ల తరబడి వెంటాడుతున్న అప్పుల బాధలు, సాగు చేసిన పంటలు చేతికందక అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతు ఆత్మహత్యలకు నిలయంగా మారిన పాలమూరు జిల్లాపై మరోసారి ప్రకృతి కనె్నర్ర జేసింది. ఏటా ఏదో రకంగా రైతులను తీవ్రంగా కృంగదీస్తున్న ప్రకృతి ఈ దఫా సైతం వదిలిపెట్టలేదు. యాసంగి సీజన్ మొదట్లో ప్రకృతి సహకరించడం.. దాంతో రైతులు పెద్దఎత్తున పంటలను సాగు చేశారు. అయతే, ప్రస్తుతం పంట చేతికి వచ్చే సమయంలో పిడుగుపడింది. ఈ యాసంగి సీజన్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున పంటలను సాగు చేశారు, మరోవారం పది రోజుల వ్యవధిలో వరిపంట చేతికి వస్తుందని భావించిన రైతులకు వడగళ్ల వర్షం తీవ్ర నష్టాన్ని చవిచూపించింది. కోతకు వచ్చిన వరి పంట అకాల వర్షాలు, పిడుగులు, వడగళ్లు కురియడంతో ఏకంగా పాలమూరు జిల్లాలో నాలుగు రోజుల వ్యవధిలోనే దాదాపు 8243 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దీంతో దాదాపు 3843 మంది రైతులు నష్టానికి గురయ్యారు. ఇంకా వరి చేను కోత దశలో, మరికొంత పాలగింజగా ఉంటూ పెరుగుతున్న దశలో ఉంది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇంకా ప్రతి రోజు ఏదో మండలంలో ఆకాల వర్షం కురుస్తుడడం దానికి తోడు వడగళ్ల వర్షం కురుస్తుండంతో రైతుల గుండెల్లో ఆందోళన మొదలైంది. ఈ యాసంగి సీజన్‌లో రైతులు అప్పులు చేసి మరీ పంటలను సాగస చేశారు. వడగళ్లవాన రైతుల కష్టాన్ని నేలపాలు చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో నారాయణపేట, క్రిష్ట, ధన్వాడ, కోయిల్‌కొండ, ఊట్కూర్, మాగనూర్, మక్తల్, జడ్చర్ల, గంఢీడ్, దేవరకద్ర, హన్వాడ, మద్దూరు మండలాల్లో రైతులుసాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో వంగూరు, అచ్చంపేట, చారకొండ, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల మండలాల్లో వరి, పండ్ల తోటలు నాశనమయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో సైతం ప్రకృతి కనె్నర్రజేసింది. గట్టు, కేటిదొడ్డి, ధరూర్ మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా పంటలు పనికిరాకుండా పోయాయి. దాంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లాలో వడగళ్లవాన, భారీ గాలుల దాదాపు ఎనిమిది వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనాలు వేశారు.

చిత్రం.. హన్వాడ మండలం పెంట్యానాయక్‌తండాలో వడగళ్ల వానతో దెబ్బతిన్న వరిపంటను పరిశీలిస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్