తెలంగాణ

హోంగార్డులను ఆదుకున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: దేశంలో ఏ రాష్ట్రం పెంచని విధంగా హోంగార్డులకు జీతాలు పెంచి వారిని ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం ఇక్కడ రవీంధ్రభారతిలో తమ జీతాలు పెంచినందుకు హోంగార్డుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. త్వరలో పోలీసు శాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌తో నోటిఫికేషన్ విడుదల అవుతుందని అన్నారు.
హోంగార్డులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని అన్నారు. వారు రిటైరైన తర్వాత కూడా శాఖాపరంగా అందే ప్రయోజనాల గురించి కూడా కృషి చేస్తున్నామని అన్నారు. నెలకు రూ.10 వేలకు మించని ఆదాయం పొందుతున్న హోంగార్డులకు రెట్టింపు చేసి రూ.20వేలకు పెంచడమే కాకుండా కానిస్టేబుళ్లకు అందిస్తున్న సౌకర్యాలు, అలవెన్సులను పెంచిన ఘనత సిఎం కేసీఆర్‌దేనని అన్నారు. హోంగార్డులను పర్మినెంట్ చేయడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదని, ఏ రాష్ట్రంలోనూ ఈ స్ధాయిలో జీతాలు, అలవెన్సులు లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.