తెలంగాణ

27న టీఆర్‌ఎస్ ప్లీనరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న హైదరాబాద్‌లో ప్లీనరీ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. నియోజకవర్గానికి 150 మంది ప్రతినిధుల చొప్పున 15 వేల మంది ప్రతినిధులను మాత్రమే ప్లీనరీకి ఆహ్వానించాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ప్లీనరీలో ప్రతిపాదించే తీర్మానాలను తయారు చేయడానికి రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు నేతృత్వంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కమిటీ ఏర్పాటు చేశారు.
గత ఏడాది కొంపల్లిలో ప్లీనరీ నిర్వహించిన జీబీఆర్ కనె్వన్షన్ సెంటర్‌లోనే ఈ సారి కూడా ప్లీనరీ జరగనుందని శాసనమండలిలో పార్టీ విప్ పల్లా రాజేశ్వర్‌రావు వివరించారు.
తెలంగాణ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిఆర్‌ఎస్ ప్లీనరీ విశేషాలను రాజేశ్వర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షించే కమిటీలను త్వరలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించనున్నారని ఆయన తెలిపారు.
అక్టోబర్‌లో భారీ సభ
టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేయబోయే ఫెడరల్ ఫ్రంట్ నేపథ్యంలో ఫ్రంట్‌కు మద్దతు ఇచ్చే జాతీయ నాయకులను ఎవరినీ ప్లీనరీకి ఆహ్వానించడం లేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్‌లో హైదరాబాద్‌లో దేశ రాజకీయాల్లోనే మైలు రాయిగా నిలిచిపోయేలా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నామని, దానికి మాత్రమే జాతీయ నాయకులను ఆహ్వానించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని పల్లా తెలిపారు. ఇదే బహిరంగ సభలో జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పంథా సీఎం ప్రకటిస్తారన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులకు ఇదే సభ నుంచే శంఖారావం పూరించే అవకాశం ఉందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. అలాగే టీఆర్‌ఎస్ నాలుగేళ్ల పాలనపై ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్టును సభ ద్వారా తెలుపుతామన్నారు.ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను బహిరంగ వేదికపైకి ఆహ్వానించి వారితో సిఎం మాట్లాడనున్నారని రాజేశ్వర్‌రెడ్డి వివరించారు.