తెలంగాణ

పౌర సేవల హక్కు చట్టాన్ని తీసుకురండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: రాష్ట్ర ప్రజలకు నిజాయితీగా, స్వేచ్ఛగా సేవలు అందించేందుకు పౌర సేవల హక్కు చట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆదివారం లేఖ రాశారు. ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, నిజాయితీగా ఉండాలని, ఉంటాయని, అందుకోసం పౌర సేవల చట్టాన్ని తీసుకువస్తామని గతంలో మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే నడుస్తున్న ప్రభుత్వాలు ప్రజలకు సేవలు సకాలంలో అందేలా చూడాలని అన్నారు. లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ అక్టోబర్, 2016లో పౌర సేవల హక్కు చట్టం ఎలా ఉండాలనే విషయాన్ని వివరిస్తూ ఉత్తరం రాశారు, అన్ని ప్రధాన ప్రతిపక్షాలు గతనెల 19న ప్రత్యేక సమావేశం నిర్వహించి చట్టం తేవాల్సిన అవశ్యకతను వివరిస్తూ మీకు లేఖ రాశాయి. కాగా ఇప్పటి వరకు వాటిపై మీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విచారకరం అన్నారు. ఈ చట్టాన్ని తీసుకువచ్చి దేశానికి ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.