తెలంగాణ

హాజ్ యాత్రికులు ఆరోగ్యంపై దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: రాష్ట్రం నుంచి హాజ్ యాత్రకు వెళుతున్న వారు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ మసి ఉల్లాఖాన్ సూచించారు. ఆదివారం బాలానగర్‌లో హాజ్ యాత్రకు వెళుతున్న వారి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. దేశం కాని దేశంలో ఏదైనా ఆనారోగ్యానికి గురి అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. దీనిని అధిగమించేందుకు నిత్యం వాకింగ్ వంటి సాధారణ వ్యాయామాలు చేయాలని సూచించారు. హాజ్ యాత్రకు సంబంధించిన నియమ నిబంధనలు ఎలా ఉంటాయి, ఏ మేరకు లగేజీ అనుమతి ఇస్తారు, అక్కడ ఉచిత వసతి సౌకర్యాన్ని ఎలా వినియోగించుకోవచ్చు అనే విషయాలను ఎగ్జిక్యూటివ్ అధికారి షుకూర్ వివరించారు.