తెలంగాణ

ఏ ఫ్రంట్‌తోనూ పొత్తు పెట్టుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 10 : బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పెద్దఎత్తున కుంభకోణాలు పెరిగాయని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. బీజేపీపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకొని ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చారని.. మోదీ సర్కార్ గద్దెనెక్కగానే ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిందని విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివమ్స్‌గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ సర్కార్ చరిత్రను వక్రీకరిస్తూ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. దేశంలో ప్రముఖ జర్నలిస్టుల హత్యలు జరగుతుంటే ఇప్పటి వరకు నిందితులను పట్టుకోకపోవటం విచారకరన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మతతత్వం పేట్రేగిపోయిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించాలనే నినాదంతో సీపీఎం పార్టీ ముందుకు వెళ్తుందన్నారు. భవిష్యత్తు ఎన్నికల్లో సీపీఎం ఏ ఫ్రంట్‌తో పొత్తు పెట్టుకోదన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలకు స్థిరమైన విధి, విధానాలు లేవన్నారు. అవకాశ స్వార్థ రాజకీయాల కోసం ప్రాంతీయ పార్టీలు పనిచేస్తున్నాయని, అందుకే ఏ పార్టీతో ఎటువంటి పొత్తు పెట్టుకోమన్నారు. మహాసభల విజయవంతానికి సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లినప్పుడు ఫెడరల్ ఫ్రంట్ గురించి తనతో చర్చించినట్లు తెలిపారు. బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ పక్షాన తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు బీఎల్‌ఎఫ్ పక్షాన 70 సీట్లు కేటాయిస్తామని, మిగిలిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బహుజనులకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో స్పష్టం చేయాలన్నారు. ఇప్పటికే ఇక్కడ 22 పార్టీలున్నాయని, ఇంకా సీపీఐ, కోదండరామ్ కొత్త పార్టీ, మందకృష్ణ, ఆర్. కృష్ణయ్యలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. దేశ రాజకీయ పాలన వ్యవస్థపై సీపీఎం జాతీయ మహాసభల్లో కార్యచరణ రూపొందిస్తామన్నారు. ఈనెల 18 నుండి 22 వరకు జరుగనున్న సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

చిత్రం..సిద్దిపేటలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరభద్రం